కుక్కల బెడదపై GHMCకి ఫిర్యాదుల వెల్లువ
- February 24, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లోని అంబర్పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గంటల్లో సుమారు 15 వేల ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది. గంటకు 416 ఫిర్యాదులు వస్తున్నాయట. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు 10 ఫిర్యదులపై స్పందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై ప్రత్యేక ఆపరేషన్ టీంలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో షెల్టర్ హోంలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 150 ఆపరేషన్లు మాత్రమే జీహెచ్ఎంసీ చేస్తోంది. ఈ సామర్థ్యాన్ని మరింత పేంచే ప్రయత్నం చేస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







