శుభవార్త.. ఫిబ్రవరి 25 నుండి ఓవర్‌స్టే జరిమానాలు, పర్మిట్ల క్రమబద్ధీకరణ
- February 24, 2023
యూఏఈ: వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) గుడ్ న్యూస్ చెప్పింది. వీసా సమస్యలు ఉన్న నివాసితులు, సందర్శకులు, పర్యాటకుల కోసం దీరా సిటీ సెంటర్లో 'అందరికీ హోమ్‌ల్యాండ్' పేరుతో 3-రోజుల క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ప్రతిరోజూ నిర్వహించే ఈ క్యాంపెయిన్ లో పలు వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. వీసా గడువు ముగిసిన వారు, వీసా అనుమతి కంటే ఎక్కువ కాలం గడిపిన వారితో సహా వీసాలో ఏవైనా సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడానికి సెంటర్‌పాయింట్‌కు సమీపంలోని డెయిరా సిటీ సెంటర్లోని ఏర్పాటు చేసిన స్టాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు GDRFA అధికారులు అందుబాటులో ఉంటారు. వీసా సమస్యలున్న వారు స్టాల్ వద్దకు రావాలని GDRFAలోని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలేం బిన్ అలీ సూచించారు. యూఏఈలో అనుమతించబడిన వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం గడిపినందుకు రోజుకు Dh50 జరిమానా విధించబడుతుంది. దాంతోపాటు వీసా రద్దుకు కూడా దారితీసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







