శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత
- February 25, 2023
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి ఎమిరేట్స్ EK528 విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది.దాని విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేశాడని, దానిని లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. సూడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సూడాన్ నుంచి షార్జా మీదుగా గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. దీంతో 14 కేజీల 906 గ్రాముల బంగారం లభించింది. దీనివిలువ రూ.7.89 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో ఆభరణాలను ఉంచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







