24 గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు

- February 26, 2023 , by Maagulf
24 గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు

అబుధాబి: ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం.ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సంబంధిత ధృవపత్రం జారీ చేయడం జరుగుతుంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ గురువారం ప్రకటించింది.దీని కోసం ప్రత్యేక డిజిటల్ సర్వీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొంది.ఇక సర్వీస్ పొందేందుకు వినియోగదారులు ఒక్కొ సర్టిఫికేట్‌కు 60 దిర్హాములు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.ఈ సేవల కారణంగా వినియోగదారుల సమయం వృథాకాకుండా ఉండడంతో పాటు అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని, అది కూడా ఒక వర్కింగ్ డేలో సర్టిఫికేట్ జారీ కావడం అనేది నిజంగా అద్భుతం అని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు.అత్యావసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com