యాత్రికుల ఉమ్రాపై పరిమితి లేదు: హజ్ మంత్రిత్వ శాఖ

- February 27, 2023 , by Maagulf
యాత్రికుల ఉమ్రాపై పరిమితి లేదు: హజ్ మంత్రిత్వ శాఖ

మక్కా: యాత్రికులు చేసే యాత్రలపై పరిమితి లేదని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే, తీర్థయాత్ర చేయడానికి నిర్దిష్ట సమయానికి అపాయింట్‌మెంట్ తీసుకోవాలనే ఆదేశాలను పాటించడం తప్పనిసరి అని పలువురు అడిగిన ప్రశ్నకు మంత్రిత్వ శాఖ సమాధానం తెలిపింది. సందర్శన, పర్యాటక లేదా వర్క్ వీసాపై రాజ్యానికి వచ్చిన వారు ఉమ్రా చేయవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యాత్రికుడు రాజ్యం నుండి బయలుదేరే సమయంలో తన రాక కోసం ఉపయోగించిన రవాణా మార్గాలను కూడా మార్చుకోవచ్చని తెలిపింది. ఉమ్రా వీసా హోల్డర్ మక్కా,మదీనాల మధ్య అలాగే రాజ్యంలో ఉన్న అన్ని నగరాల మధ్య అతను నివసించడానికి అనుమతించబడిన కాలంలో ప్రయాణించవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు సౌదీ అరేబియాలోని ఏదైనా అంతర్జాతీయ లేదా ప్రాంతీయ విమానాశ్రయం నుండి ప్రవేశించవచ్చు, బయలుదేరవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com