మార్చి 2న స్పేస్‌ఎక్స్ క్రూ-6 ప్రయోగం

- February 27, 2023 , by Maagulf
మార్చి 2న స్పేస్‌ఎక్స్ క్రూ-6 ప్రయోగం

యూఏఈ: సోమవారం గ్రౌండ్ సిస్టమ్ లో ఏర్పడ్డ సమస్య కారణంగా కౌంట్‌డౌన్ చివరి నిమిషాల్లో స్పేస్‌ఎక్స్ క్రూ-6 ప్రయోగాన్ని నాసా నిలిపివేసింది. ఈ మేరకు నాసా ట్విట్టర్‌లో తెలిపింది. “నేటి క్రూ6 లాంచ్ గ్రౌండ్ సిస్టమ్‌లతో సమస్య కారణంగా స్క్రబ్ చేయబడింది.’’ అని ట్వీట్ లో వెల్లడించింది. ఫాల్కన్ 9 మొదటి దశ మెర్లిన్ ఇంజిన్‌లు, ట్రైఎథైల్యూమినియం ట్రైథైల్బోరాన్ (లేదా TEA-TEB) పూర్తి లోడ్‌ను నిర్ధారించే డేటాను మిషన్ బృందాలు విశ్లేషించే పనిలో ఉన్నారు. కాగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయోగ రిజర్వ్ డే అయిన ఫిబ్రవరి 28ని నాసా, స్పేస్ ఎక్స్ రద్దుచేశాయి. అందుబాటులో ఉన్న తదుపరి ప్రయోగ తేదీ అయిన మార్చి 2న(సోమవారం) 12:34 a.m. EST ప్రయోగం చేపడతామని తెలిపారు.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ “ప్రయోగం వాయిదా పడింది. అయినప్పటికీ మా ఆశయాలు ఉన్నతంగానే ఉన్నాయి. ఎమిరాటీ వ్యోమగామి @Astro_Alneyadi అండ్ మొత్తం క్రూ-6 బృందానికి సురక్షితమైన, విజయవంతమైన మిషన్ కావాలని కోరుకుంటున్నాను. #జాయేద్ ఆశయం." అని తన ట్వీట్ లో ఆకాంక్షించారు.

స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ-6 మిషన్ యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ లిఫ్ట్-ఆఫ్‌కి కేవలం రెండు నిమిషాల ముందు సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు.  ఈ ప్రయోగం ద్వారా నాసాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హోబర్గ్, రష్యాకు చెందిన ఆండ్రీ ఫెడ్యావ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సుల్తాన్ అల్-నెయాడి అంతర్జాతీయ కక్ష్య స్టేషన్‌లో ఆరు నెలలు గడపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com