వైయస్ఆర్ రైతు భరోసా సాయం విడుదల
- February 28, 2023
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి లో వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ జమ చేసారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ అందజేశారు.
ఈసందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. 2022 డిసెంబర్‌లో మాండూస్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించామన్నారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చామని సీఎం జగన్ తెలిపారు.
అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్న జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తెనాలి మార్కెట్ యార్డ్‌లో సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







