విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్
- February 28, 2023
తెలంగాణ: రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను అభివృద్ది చేస్తామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 2వేల మంది విద్యార్థులకు మంత్రి కెటిఆర్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86వేలు ఉంటుందన్న ఆయన.. విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే సిరిసిల్ల జిల్లాకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో గ్రామీణ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా 3 వేల ట్యాబ్లు అందజేస్తామని కెటిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







