బర్త్‌డే స్పెషల్: కమెడియన్‌గా స్టార్ట్ చేసి, విలన్‌గా సెటిలైపోయిన సునీల్.!
- February 28, 2023
మంచి టైమింగ్ వున్న కామెడీతో తనదైన శైలి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. అప్పట్లో ఏ హీరో సినిమా అయినా సరే, పక్కన సునీల్ కామెడీ వుండాల్సిందే. అంతలా సునీల్ తన కామెడీతో మెప్పించాడు. ఆ తర్వాతి కాలంలో హీరో అవతారమెత్తాడు. రాజమౌళి పుణ్యమే అదంతా. ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరో అయిపోయిన సునీల్ ఆ తర్వాత ‘పూల రంగడు’ సినిమాతో స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు.
కానీ, ఆ పై కథల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేశాయ్. దాంతో అటు కమెడియన్‌గానూ కాక, ఇటు హీరోగానూ కాక కొన్నాళ్లు సునీల్ కెరీర్ డౌన్ ఫాల్లో నడిచింది. ‘పుష్ప’ సినిమాతో మళ్లీ సునీల్ హవా మొదలైంది.
ఈ సారి ప్యాన్ ఇండియా రేంజ్ అందుకున్నాడు సునీల్. అయితే, విలన్‌గా. వైవిధ్యమైన విలనిజం ప్రదర్శిస్తూ టాలీవుడ్‌తో పాటూ, తమిళ తంబీల్నీ ఇంప్రెస్ చేశాడు సునీల్. ప్రస్తుతం ‘జైలర్’, ‘జపాన్’ తదితర తమిళ ప్రాజెక్టుల్లో సునీల్ భాగమైపోయాడు. ఈ రోజు సునీల్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ పోటెత్తుతున్నాయ్. సునీల్ ఇలాంటి బర్త్‌డేలు ఇంకెన్నో చేసుకోవాలని.. కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







