ఈ రెస్టారెంట్లలో విజిట్ వీసా హోల్డర్లకు ఉచిత భోజనం

- February 28, 2023 , by Maagulf
ఈ రెస్టారెంట్లలో విజిట్ వీసా హోల్డర్లకు ఉచిత భోజనం

యూఏఈ: యూఏఈ సంస్కృతి, సమాజంలో చారిటీ అనేది ఒక భాగం. యూఏఈ బిలియన్ మీల్స్ చొరవ కింద గత సంవత్సరం రికార్డు స్థాయిలో 600 మిలియన్ మీల్స్ ను విరాళంగా అందించారు. యూఏఈలో అనేక ఆసియా, అరబిక్ రెస్టారెంట్లు అవసరమైన బ్లూ కాలర్ కార్మికులకు, విజిట్ వీసాపై వచ్చిన వ్యక్తులకు.. ముఖ్యంగా తక్కువ-ఆదాయ దేశాల నుండి వచ్చిన వారికి ఉచిత భోజనాన్ని అందిస్తున్నాయి. సాధారణంగా ఈ హోటల్స్ అరబిక్, పాకిస్తానీ, ఆఫ్ఘన్, భారతీయ వంటకాలను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తున్నాయి.

ఉచిత భోజనాన్ని అందించే రెస్టారెంట్‌ల జాబితా..
ఫౌల్ డబ్ల్యూ హమ్ముస్: అరబిక్ రెస్టారెంట్‌లో ఎవరూ ఆకలితో అలమటించకూడదని ఉచితంగా ఆహారం ఇస్తోంది. ప్రజలు ఫౌల్ డబ్ల్యు హమ్మస్, ఫలాఫెల్, మౌతబాల్, పైన్ నట్స్‌తో కూడిన హమ్మస్, శాండ్‌విచ్‌లు, మరిన్నింటి మెను నుండి ఎంచుకోవచ్చు.

ఫట్టా కవారెహ్: అబు హైల్‌లోని ఈ ఈజిప్షియన్ తినుబండారం. పేదలకు ఉచితంగా భోజనాన్ని కూడా అందిస్తుంది. గత ఏడాది పవిత్ర రమదాన్ మాసంలో భోజనం చేయలేని వ్యక్తులు రెస్టారెంట్‌లోకి వెళ్లడాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రెస్టారెంట్ మేనేజర్ అతియా యూసెఫ్ తెలిపారు.

 రుచికరమైన దోస: భారతీయ రెస్టారెంట్. రక్తదానం చేసే వ్యక్తులకు.. భోజనం కోసం డబ్బు లేని వారికి వారికి ఉచితంగా భోజనాలు అందిస్తుంది. రక్తదాతలకు ఉచిత భోజనం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందువల్ల రక్తదాన రశీదు ఉన్న వ్యక్తులు, దుబాయ్ - షార్జాలోని మూడు రెస్టారెంట్లలో దేనినైనా సందర్శించి ఎటువంటి రుసుము చెల్లించకుండా రెస్టారెంట్ వంటకాలను ఆస్వాదించవచ్చని యమ్మీ దోసా మేనేజింగ్ డైరెక్టర్ జుగల్ పరేఖ్ తెలిపారు.

కరాచీ స్టార్: పాకిస్థానీ, భారతీయ వంటకాలను అందించే ఈ రెస్టారెంట్ పేదలకు, విజిట్ వీసాపై వచ్చిన ప్రవాసులకు ఉచితంగా భోజనం అందిస్తోంది. "ఉద్యోగం లేనివారు, లేదా విజిట్ వీసాపై ఉన్నవారు లేదా వీసా గడువు ముగిసిన వారు షార్జాలోని మువీలా, సజాలో ఉన్న మా రెస్టారెంట్‌లకు రావచ్చు.మేము వారికి ఉచిత భోజనాన్ని అందిస్తాము" అని కరాచీ స్టార్ యజమాని షాహిద్ అస్గర్ బంగాష్ చెప్పారు.  

 షిన్వారీ టిక్కా: దీరాలో ఉన్న ఈ రెస్టారెంట్ సహాయం కోరే ఎవరికైనా ఉచిత ఆహారాన్ని అందిస్తుంది. సగటున రోజుకు నలుగురు వ్యక్తులు ఉచితంగా భోజనం చేసేందుకు వస్తారని, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మంది ఉచిత భోజనం కోసం అభ్యర్థిస్తారని రెస్టారెంట్ యజమాని ఖైర్ అల్ అమీన్ చెప్పారు.

ఖైర్ దర్బార్: అల్ క్వోజ్‌లోని రెస్టారెంట్ బ్లూ కాలర్ కార్మికులకు లేదా కోరిన వారికి ఉచిత భోజనాన్ని అందిస్తుంది.

పాక్ ఖైర్ దర్బార్: దీరా దుబాయ్‌లో ఉన్న పాక్ ఖైర్ దర్బార్.. పాకిస్థానీ, భారతీయ వంటకాలను అందిస్తుంది. కోరిన వ్యక్తులకు ఉచిత ఆహారాన్ని కూడా అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com