ఒమన్‌లో ఫ్యూచర్ జాబ్స్: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ ఇంజనీరింగ్
- February 28, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో భవిష్యత్ లో జాబ్ మార్కెట్‌లో డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ ఇంజినీరింగ్, 3డి ప్రింటింగ్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఇంజనీరింగ్ రంగాలలో ఉంటాయని షురా కౌన్సిల్ యూత్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కమిటీ సభ్యుడు HE షేక్ సుల్తాన్ బిన్ హుమైద్ అల్ హొసానీ తెలిపారు. అతను ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొని ఫ్యూచర్ జాబ్ మార్కెట్-ఉద్యోగ అవకాశాలు అనే విషయాలపై ప్రసంగించారు. డేటా అనలిస్ట్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్‌సెక్యూరిటీ, రోబోటిక్స్ ఇంజినీరింగ్, 3D ప్రింటింగ్ సహా అనే స్పెసిఫికేషన్లలో ఉద్యోగాలు భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని తెలిపారు. నాలుగో, ఐదవ పారిశ్రామిక విప్లవాలతో జాబ్ మార్కెట్ పూర్తిగా మారిందని, భవిష్యత్ వృత్తులను అభ్యసించగల జాతీయ కేడర్‌లను తయారు చేయడంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2021లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ (దావోస్‌లో).. 2025 నాటికి దాదాపు 85 మిలియన్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని సూచించిందని అల్ హొసానీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







