సౌదీలో 2035 నాటికి 82% వేస్ట్ డంప్స్ తొలగింపు
- February 28, 2023
రియాద్: 2035 నాటికి సౌదీ అరేబియాలో అన్ని రకాల వేస్ట్ డంప్‌లలో 82% తోలగించనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (MWAN) సెక్టార్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మెషరీ అల్-క్వీజానీ తెలిపారు. రియాద్‌లో వేస్ట్ మేనేజ్‌మెంట్ సెక్టార్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో అల్-క్వీజానీ పాల్గొని ప్రసంగించారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, త్వరలోనే సౌదీ అరేబియా సానుకూల పర్యావరణ, ఆర్థిక- సామాజిక ప్రభావాలను చూస్తుందని అల్-క్వీజానీ పేర్కొన్నారు. 73 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన వాటిని తగ్గించి పర్యావరణ హితానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇంధన వినియోగంలో 60 మిలియన్ బ్యారెళ్ల చమురును ఆదా చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇది 1,200 వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు 77,000 ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దాంతో పాటు 120 బిలియన్ల స్థూల దేశీయోత్పత్తికి (GDP) దోహదపడుతుందని అల్-క్వీజానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







