తెలంగాణకు మరో వందే భారత్ రైలు..
- February 28, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందే భారత్ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ సేవలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పూణె రూట్లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్-పుణెల మధ్య ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే వందే భారత్ రైలుతో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సికింద్రాబాద్-పుణె మార్గంలో రైలు పరుగులు తీయనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఇండియన్ రైల్వే ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఏప్రిల్ నాటికి ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో సికింద్రాబాద్ నుంచి మొత్తం మూడు మార్గాల్లో వందే భారత్ పరుగులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో వందే భారత్ పరుగులు పెట్టనునన్నట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







