విద్యుత్ వినియోగంలో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ
- February 28, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగం అయ్యింది. గతేడాది మార్చిలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా..ఈ సారి డిసెంబర్ లోనే ఆ రికార్డ్ ను అధిగమించి 14,501 మెగా వాట్ల విద్యుత్ నమోదే ఇప్పటి వరకు రికార్డ్ గా ఉంది. తాజాగా మంగళవారం అత్యధికంగా 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగించడంతో కొత్త రికార్డ్ నమోదైంది.
రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోందని.. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని తెలిపారు టీఎస్ ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37శాతం వ్యవసాయరంగానికే కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చాహ్రూ. దక్షిణ భారతదేశంలో విద్యుత్ వినియోగంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉందని, ఈ వేసవిలో 16వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశముందని.. ఎంత డిమాండ్ వచ్చినా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఇవాళ విద్యుత్ డిమాండ్ నమోదు కావటం విశేషమన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







