ఖతార్ ఎయిర్వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె
- March 01, 2023
దోహా: ఖతార్ ఎయిర్వేస్ తన తాజా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ నటి దీపికా పదుకొణెతో కలిసి కొత్త బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఖతార్ ఎయిర్వేస్ ప్రీమియం అనుభవాన్ని విస్తరణకు ఎయిర్‌లైన్ ప్రయత్నంలో భాగంగా తాజా ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అక్బర్ అల్ బేకర్ తెలిపారు. ఖతార్ ఎయిర్వేస్ తన కస్టమర్లకు ఆకాశంలో.. నేలపై ప్రీమియం అనుభవాలను ఎలా అందజేస్తుందో దీపిక అందంగా ప్రదర్శించిందని పేర్కొన్నారు. దీపికా మా బ్రాండ్‌కు సరైన గ్లోబల్ అప్పీల్ అని, చరిష్మా ఉన్నందున ఆమెను ఎంపిక చేశామన్నారు. ఖతార్ ఎయిర్వేస్లో దీపిక మా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
బహుళ అవార్డు-విజేత విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్వేస్ ఇటీవలే 2022 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో 'ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డు పొందింది. దీనిని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ నిర్వహిస్తుంది. ఎయిర్‌లైన్ అపూర్వమైన ఏడవ సారి (2011, 2012, 2015, 2017, 2019, 2021, 2022) ప్రధాన బహుమతిని గెలుచుకున్న ఎక్సలెన్స్‌కు పర్యాయపదంగా నిలిచింది. అదే సమయంలో 'ప్రపంచపు అత్యుత్తమ వ్యాపార తరగతి', 'ప్రపంచపు ఉత్తమ వ్యాపార తరగతి' లాంజ్ డైనింగ్', 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్' అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ఖతార్ ఎయిర్వేస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







