భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
- March 01, 2023
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్(32).. బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్.. సిడ్నీ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడి కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రహమతుల్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ న్యూస్ పేపర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిడ్నీ ఆబర్న్ స్టేషన్లో అహ్మద్ ఓ క్లీనర్ (28)పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. ఆపై దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







