దుబాయ్ లో ఘనంగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్
- March 01, 2023
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులందనీ ఏకం చేయడానికి నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ (NAPA - USA & UAE) మరియు నేత ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన మొట్ట మొదటి గ్లోబల్ పద్మశాలి సమ్మిట్, దుబాయ్ లోని క్రౌన్ ప్లాజా హోటల్ నందు 26 ఫిబ్రవరి 2023 రోజున అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మొదటగా నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ యూఏఈ చాప్టర్ ని ప్రారంభించడంతో పాటు గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ లోగో ఆవిష్కరించడం జరిగింది. వివిధ దేశాలలో ఉన్న పద్మశాలి కుల బాంధవ్యులందరినీ ఒకే గొడుగు కిందకి చేర్చే ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
అమెరికా, యూఏఈ, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్ వంటి 12 కు పైగా దేశాల ప్రతినిధులు సకుటుంబ సపరివార సమేతంగా ఈ మహోన్నత కార్యక్రమానికి విచ్చేసి, సఫలీకృతం చేయడం జరిగింది.
వన్నెల శ్రీరాములు, ఎల్.రమణ, గుండు సుధారాణి, గంజి చిరంజీవి, కందగట్ల స్వామి , ప్రవీణ్ గూడూరి వంటి ప్రముఖులతో పాటు, NAPA UAE-AC ప్రమోద్ పిల్లమారి, NAPA UAE - CD రవిచంద్ర గుత్తికొండ మరియు NAPA USA-AC డాక్టర్ హరి ఇప్పనపల్లి ,బాబురావు సామల, ప్రదీప్ సామల, NAPA USA-EC బాలాజీ జిల్లా, రమేష్ గంట్యాల, అజయ్ బుధాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలందరికి సంబంధించిన పలు అంశాలపై ఉపన్యసించడం జరిగింది.గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ కి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో విడుదల చేయబడుతుందని నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్-అమెరికా ప్రెసిడెంట్, అజయ్ బుధాటి ప్రకటించడం జరిగింది.
దుబాయ్ లో జరిగిన ఈ మొట్టమొదటి గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ ని NAPA - USA వారి సహకారంతో, Netha Events మరియు NAPA-UAE తరపున రవిచంద్ర గుత్తికొండ, మార్కొండయ్య కోడి, రమేష్ బైరి, శ్రీనివాస్ భైరి, ప్రవీణ్ తల్లా,శరత్ చంద్ర పిల్లలమర్రి మరియు విజయ్ చిట్టి మల్ల తదితరులు ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి సఫలీకృతం చేయడం కోసం శ్రమించిన తీరు ఎంతో ప్రశంసనీయం మరియు భావితరాలకు ఆదర్శం.
పలు సాంస్కృతిక కార్యక్రమాలతో గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ కార్యక్రమం దుబాయిలో ఎంతో కోలాహలంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సాహితీ ఆమంచ ద్వారా ప్రదర్శింపబడిన "సింహ నందిని" నృత్య ప్రదర్శన ప్రత్యేక ప్రశంసలను అందుకోవడం జరిగింది. NAPA Women Wing సభ్యులైన లతా బైరి, సరస్వతి గుత్తికొండ, రేవతి బైరి, మరియు సౌజన్య కోడి తదితరులు పాలుపంచుకున్న పద్మశాలి కమ్యూనిటీ థీమ్ సాంగ్ మరియు వివిధ దేశాల నుంచి విచ్చేసిన పద్మశాలి కపుల్స్ రాంప్ వాక్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివిధ దేశాల నుంచి విచ్చేసిన పద్మశాలి కుటుంబ సభ్యులందరూ ఇలా కలిసిమెలిసి పండుగ వాతావరణాన్ని తలపించేలా మొట్టమొదటి గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ ని ఎంతో ఘనంగా ఒకే కుటుంబంగా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్యక్రమం నిర్వాహకులు పేర్కొనడంతోపాటు ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబ సభ్యులకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.






తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







