యూఏఈ ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు
- March 02, 2023
యూఏఈ: యూఏఈలో కొత్త ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ అథారిటీ (ICP) తెలిపింది. దరఖాస్తు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి అమలు చేస్తున్న మార్పులను అధికార యంత్రాంగం షేర్ చేసింది.
కొత్త ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్ కీలక మార్పులు:
1. ఫారమ్ రీ డిజైన్ చేయబడింది. ICP ప్రకారం.. ఇది అధికార యంత్రాంగం 'విజువల్ ఐడెంటిటీ'కి అనుగుణంగా జరిగింది.
2. దరఖాస్తుదారుల వ్యక్తిగత ఫోటోను ఫారమ్ ఎడమ ఎగువ భాగంలో పెట్టాలి.
3. ఫారమ్ కుడి ఎగువ భాగంలో QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా అప్లికేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.
4. ప్రక్రియలో తదుపరి దశ ఫారమ్ ప్రత్యేక భాగంలో వివరించారు.
5. కార్డ్ డెలివరీ చేయబడే కంపెనీ పేరు ఫారమ్ దిగువ ఎడమ వైపున దాని చిరునామాతో పాటుగా పేర్కొన్నారు.
6. కస్టమర్ వాయిస్ గేట్‌వేని యాక్సెస్ చేయడానికి QR కోడ్ ను యాడ్ చేశారు. ఇది ICPతో ఫిర్యాదులను నమోదు చేసే మెకానిజం.
7. మరొక QR కోడ్ కస్టమర్ ఫింగర్ ఫ్రింట్ అపాయింట్మెంట్ తేదీని మార్చడానికి ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







