చరిత్ర సృష్టించిన యూఏఈ.. అంతరిక్షంలోకి సుల్తాన్ అల్నెయాడి
- March 02, 2023
యూఏఈ: యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి చరిత్ర సృష్టించాడు. క్రూ-6తోసహా అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకొని అరబ్ చరిత్రలో హీరోగా నిలిచారు. మొదటి ప్రయోగం వాయిదా పడ్డ మూడు రోజుల అనంతరం అరబ్ స్పేస్ మిషన్ టేకాఫ్ విజయవంతం అయింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 27న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ప్రయోగానికి రెండు నిమిషాల ముందు ప్రయోగాన్ని రద్దు చేశారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రిజర్వ డే అయిన మార్చి 2న విజయవంతంగా ప్రయోగించారు.
ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ వ్యోమనౌకపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా క్రూ-6 మిషన్ ఈ రోజు ఉదయం 9.34 గంటలకు (యూఏఈ కాలమానం ప్రకారం) దూసుకుపోయింది. నాసా వ్యోమగాములు స్టీఫెన్ బోవెన్, వారెన్ హోబర్గ్, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్‌లతో కలిసి సుల్తాన్ అల్నెయాడి ఆరు నెలలపాటు కక్ష్యలో పరిభ్రమించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రయోగశాలలో గడుపనున్నారు.
ప్రయోగానికి ముందు యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దిశగా ప్రయాణిస్తున్న డ్రాగన్ ఎండీవర్ అంతరిక్ష నౌక నుండి అరబిక్‌లో ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. "అస్సలాముఅలైకుమ్ (సాంప్రదాయ అరబిక్, ఇస్లామిక్ గ్రీటింగ్) శుక్రన్ జజీలన్ (చాలా ధన్యవాదాలు). ఈ అనుభవం నమ్మశక్యం కావడం లేదు. తన జీవితంలో ఇది అద్భుతమైన క్షణం. నా తల్లిదండ్రులు, కుటుంబం, యూఏఈ దేశ నాయకత్వం, మహ్మద్ బిన్ రషీద్ అంతరిక్ష కేంద్రానికి ధన్యవాదాలు. మాకు శిక్షణనిచ్చి మమ్మల్ని సిద్ధం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాసా, స్పేస్ ఎక్స్.. గో, డ్రాగన్, ఫాల్కన్!"అంటూ తన సందేశాన్ని వినిపించారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఉదయం 9.32 గంటలకు యూఏఈ అంతరిక్ష కేంద్రానికి(MBRSC) చేరుకున్నారు. కేంద్రంలోని గ్రౌండ్ కంట్రోల్ టీమ్‌లో చేరి ప్రయోగాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చరిత్ర సృష్టించిన యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







