నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు..
- March 02, 2023
న్యూఢిల్లీ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధి గెలవడం తొలిసారి కావడం విశేషం. దిమాపూర్ -3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు 1536 ఓట్లతో గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీలో ఆరు దశాబ్దాల తరువాత ఓ మహిళ ఎమ్మెల్యే అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు మేఘాలయా అసెంబ్లీ స్పీకర్ మెట్బా లింగ్డో కూడా ఘనవిజయం సాధించారు. యూడీపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన మెట్బా లింగ్డో 155 ఓట్లతో గెలుపొందారు.
మరోవైపు ఈనాశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాగాలాండ్‌లో బిజెపి, ఎన్డీపీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఈ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్ 2 చోట్ల గెలిచి మరో 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఎన్‌పీపీ ఒక చోట గెలిచి.. 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచి.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్







