రామ్ చరణ్ - ఎన్టీయార్ ఆస్కార్ రచ్చ.?
- March 02, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ని బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ‘నాటు నాటు’ సాంగ్ అంతర్జాతీయ వేదికలపై మార్మోగిపోతోంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు.. అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు నామజపమే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలోనే వున్న రామ్ చరణ్ పలు ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ మన తెలుగు సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నాడు.
ఇదిలా వుంటే, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రామ్ చరణ్. ఇదే అవార్డు ఫంక్షన్‌కి ఎన్టీయార్ కూడా హాజరవ్వాల్సి వుండగా, తారకరత్నమరణం కారణంగా ఎన్టీయార్ వెళ్లలేకపోయాడు.
రామ్ చరణ్ అమెరికాలో చేస్తున్న సందడి నేపథ్యంలో ఎన్టీయార్ అభిమానులుగా చెప్పుకునే కొందరు ఆకతాయిలు.. ఆ ముసుగుతో సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల కారణంగా అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు సినిమా పరువు పోయే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. హీరోల మధ్య లేని తారతమ్యాలు.. విబేధాలు.. ఇదిగో ఇలా అభిమానులమని చెప్పుకుని తిరిగే కొందరి వల్ల నిజమే అంతర్జాతీయ వేదికలపై పరువు పోతుంది మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







