చుండ్రు బాధిస్తోందా.? ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.!
- March 02, 2023
చుండ్రు చాలా చిన్న సమస్యలా కనిపించే అతి పెద్ద సమస్య. ఓ పట్టాన పని చేసుకోనివ్వదు.. చుండ్రుతో పాటూ, దురద కూడా వుంటే ఆ బాధ వేరే లెవల్.
ప్రస్తుతం కాలుష్యం, జీవన శైలి.. తదితర కారణాల వల్ల అరుదుగా మాత్రమే కనిపించే ఈ సమస్య అత్యంత ఎక్కువగా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలను సైతం వేధిస్తోంది ఈ చుండ్రు సమస్య.
చుండ్రు కారణంగా అనవరసరమైన చికాకులే కాదు.. జుట్టు రాలిపోవడం కూడా అధికమవుతుంది.
చుండ్రును తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో వున్న సంగతి తెలిసిందే. అయితే, చుండ్రుకు శాశ్వత పరిష్కారం మాత్రం హోమ్ రెమిడీస్‌లోనే వుంది.
కొబ్బరి నూనెలో నిమ్మ రసం పిండి తలకు బాగా పట్టించి కొన్ని గంటల పాటు వదిలేయాలి. ఇలా తరచూ చేస్తే నెమ్మదిగా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
అలాగే, వేప ఆకుల్ని పేస్టులా చేసి తలకు పట్టించినా చుండ్రు బాధ తగ్గుతుంది. మెంతులు నానబెట్టి పేస్టు చేసి తలకు పట్టించినా ఫలితం వుంటుంది. ఈ చిట్కాలు కాస్త ఆలస్యంగా పని చేసినా ఫలితం మాత్రం శాశ్వతంగా వుంటుంది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







