విరూపాక్ష టీజర్ టీజర్ విడుదల
- March 02, 2023
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం విరూపాక్ష.ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ గురువారం విడుదలైంది.ఆక్సిడెంట్ తరువాత తేజ్ నటించిన మూవీ ఇది.ఈ సినిమా తాలూకా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు.ఇప్పటీకే ఈ సినిమా తాలూకా గ్లింప్స్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. ఈ గ్లింప్స్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన స్వరంతో అతడు ‘అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ పలికిన డైలాగ్ హైలైట్గా నిలిచింది.
ఇక ఇప్పుడు టీజర్ సైతం అదే రేంజ్ లో ఆసక్తి పెంచింది. ఒక గ్రామంలో ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే ఆ సమస్య పరిష్కరించడానికి గ్రామస్తులు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు.తరువాత అదే గ్రామంలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ సమస్యకి గల కారణం వెతికే పనిని హీరో మొదలు పెడతాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్యని హీరో ఎలా పరిష్కరించాడు అనే పాయింట్ ఈ టీజర్ ద్వారా దర్శకుడు కార్తిక్ దండు చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్య ఏంటి అనేది మనకు ఏప్రిల్ 21 న తెలుస్తుంది. ఆ రోజున ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు.ఈ లోపు మీరు ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







