MEIL ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం
- March 02, 2023
హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది.MEIL గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది.తి.తి.దే మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి.వీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు.ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు అందించాలని MEIL నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడి వినియోగించనుంది.TTD అధికారులకు బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సు పై పొందు పరిచారు.బస్సులో కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి బస్సు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం తో పాటు దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు దాని పని తీరును వివరిస్తానని తెలిపారు.MEIL విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!







