యూఏఈ వ్యోమగామి సుల్తాన్ సహా అంతరిక్ష కేంద్రానికి చేరిన క్రూ-6 సభ్యులు
- March 03, 2023
యూఏఈ: గత 24 గంటల ప్రయాణం అనంతరం యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తన క్రూ-6 సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. రాబోయే ఆరు నెలల పాటు అక్కడే వారు ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం చేరగానే వ్యోమగాములు తమ ప్రయాణ అనుభవాలను వివరించారు. అయితే, సుల్తాన్ అరబిక్‌లో మాట్లాడారు. తన కుటుంబానికి, యూఏఈ నాయకత్వం, MBRSC కు ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ, అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో చేపట్టనున్న తమ ప్రయోగ ఫలితాలు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ సరిహద్దులను చెరపడంలో సహాయం చేస్తోందన్నారు. అంతకుముందు క్రూ-6 సభ్యులకు ఐఎస్ఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత నాసా మిషన్ కమాండర్ స్టీఫెన్ బోవెన్ కేంద్రంలోకి ప్రవేశించగా.. ఆ తర్వాత నాసా పైలట్ వారెన్ హోబర్గ్, యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ వరుసగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







