వైభవంగా దాసరి నారాయణ రావు పుట్టినరోజు వేడుకలు
- May 04, 2016ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు బుధవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, విద్యార్థులు, అభిమానులు దాసరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దాసరి ఇంట్లో నిర్వహించిన వేడుకలకు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని దాసరి నారాయణరావు సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తనపై ఇంతటి ప్రేమాభిమానులు చూపించినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా మోహన్‌బాబు, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్నాకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా దాసరి, మోహన్‌బాబు, శత్రుఘ్నసిన్హా చేతుల మీదుగా 'సినీ ఉదయం' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో సినిమా, రాజకీయంతో పాటు, క్రీడలకు సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఈ వేడుకల్లో జగపతిబాబు, దర్శకుడు కోడి రామమ్మూర్తి, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న, నరేష్, గిరిబాబు, ఆర్.నారాయణమూర్తి, దగ్గుబాటి సురేశ్, ఛోటా కె.నాయుడు, బాబుమోహన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







