మార్చి 6 నుండి దుబాయ్ మెట్రో స్టేషన్లలో ‘మ్యూజిక్ ఫెస్టివల్’
- March 04, 2023
దూబాయ్: బ్రాండ్ దుబాయ్, దుబాయ్ మెట్రో మ్యూజిక్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్ మార్చి 6 నుంచి ప్రారంభం కానుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. ఇది మార్చి 12 వరకు కొనసాగనుందని ప్రకటించింది. ఐదు మెట్రో స్టేషన్లు - యూనియన్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, బుర్జుమాన్, దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్, సోభా రియాల్టీలలో ఈ మ్యూజికల్ ఫెస్టివల్ సందడి చేయనుంది. ఇందులో ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన సంగీతకారులు ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారని ఆర్టీఏ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్, మార్కెటింగ్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రౌదా అల్ మెహ్రిజి తెలిపారు. నివాసితులు, సందర్శకులకు సుసంపన్నమైన సాంస్కృతిక అనుభవాలను అందించాలనే లక్ష్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ సంవత్సరం ఈజిప్ట్, భారతదేశం, ఫ్రాన్స్, థాయిలాండ్, అజర్బైజాన్, పాకిస్తాన్, నైజీరియా, క్యూబా, యునైటెడ్ కింగ్డమ్, లెబనాన్, కెనడా, నెదర్లాండ్స్, జోర్డాన్, ఆస్ట్రేలియా నుండి కళాకారులు వస్తున్నారని అల్ మెహ్రిజి తెలిపారు. ను ఒకచోట చేర్చింది. మ్యూజిక్ ఫెస్టివల్ లో ఎమిరాటీ ఎలక్ట్రికల్ గిటారిస్ట్ అయిన ఎమాన్ అల్ రైసీ, సౌదీ సంగీత విద్వాంసుడు షాదీ ఎల్.హర్బీ ప్రత్యేక ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రజలు ప్రత్యక్ష ప్రదర్శనలను వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







