రోడ్ల మధ్యలో వాహనం ఆపితే.. Dh1,000 జరిమానా
- March 04, 2023
యూఏఈ: రహదారి మధ్యలో తమ వాహనాలను ఆపడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ఇతర రహదారి వినియోగదారులకు ప్రమాదం కలిగించడం లాంటి చర్యలు మానుకోవాలని అబుధాబి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆపడం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. వీడియోలో రద్దీగా ఉండే హైవేపై వీల్ కవర్ కనిపించడంతో ఓ వ్యాన్ డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపేశాడు. దీంతో వెనకాల వస్తున్న ఇతర వాహనాల డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. మరో సంఘటనలో వ్యాన్ వెనుక ఉన్న కారు సమయానికి ఆపడంలో విఫలమై వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. అనేక వాహనాలు వ్యాన్‌ను ఢీకొనకుండా జాగ్రత్త పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్లపై సురక్షితంగా ప్రయాణించే లక్ష్యంతో 'యు కామెంట్' కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈ వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. అకస్మాత్తుగా వాహనాలను ఆపినపుడు సమీపంలోని ఎగ్జిట్‌కు వెళ్లాలని లేదా కనీసం రహదారికి కుడి వైపునకు వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు వాహనదారులకు గుర్తు చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే డ్రైవర్లకు Dh1,000 జరిమానాతోపాటు ఆరు ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధిస్తామని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







