సీబ్ బీచ్‌లో మునిగిన 9 ఏళ్ల బాలుడు
- March 04, 2023
మస్కట్: సీబ్ బీచ్‌లో శుక్రవారం విషాదకర ఘటన జరిగింది. ఓ 9 ఏళ్ల బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. మస్కట్ గవర్నరేట్‌లోని సీబ్ బీచ్‌లో మధ్యాహ్నం 1:35 గంటలకు ఒక చిన్నారి మునిగిపోయిన సంఘటన గురించి తమకు సమాచారం అందిందని విలాయత్ ఆఫ్ సీబ్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీకి చెందిన ఒక అధికారి తెలిపారు. రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు సంఘటన స్థలానికి వెళ్లాయని, పిల్లవాడిని సముద్రం నుండి బయటకు తీయగా.. అప్పటికే బాలుడు చనిపోయాడని తెలిపారు. తొమ్మిదేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి బీచ్ లో ఈత కొడుతున్నాడని అధికారి చెప్పారు. బలమైన ప్రవాహం కారణంగా బాలుడు సముద్రంలో మునిగి చనిపోయాడని వెల్లడించారు. బీచ్‌కి వెళ్లే వారందరూ నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే ఈత కొట్టాలని, పిల్లలు ఈత కొట్టేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని, ఒంటరిగా ఉండకూడదని, బీచ్ సమీపంలో ఆడుతున్నప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు పర్యవేక్షించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







