సౌదీలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు!
- March 04, 2023
జెడ్డా: రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. శనివారం నుండి బుధవారం వరకు రాజ్యంలో చాలా ప్రాంతాలలో వాతావరణ అస్థిర పరిస్థితులు ఉండవచ్చని పేర్కొంది. అసిర్, జజాన్, అల్-బాహా, మక్కా ప్రాంతాలలో మధ్యస్థం నుండి భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. మదీనా, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, హెయిల్ ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం నుండి బుధవారం వరకు భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, ఈ వాతావరణ అస్థిర పరిస్థితి బుధవారం ఖాసిం, తూర్పు ప్రాంతాలకు విస్తరిస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదేవిధంగా శని, ఆదివారాల్లో మక్కాలో తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. తబుక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు, హైల్, అల్-ఖాసిమ్, మదీనా, రియాద్ ప్రాంతంలోని పశ్చిమ భాగాలు, మక్కా, అల్-బహా, అసిర్ ప్రాంతాల తూర్పు ప్రాంతాలలో శనివారం నుండి మంగళవారం వరకు ఇసుక తుఫానులు చేలరేగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







