బంగారపు ఇటుకలతో కూతురికి తులాభారం
- March 04, 2023
దుబాయ్: దుబాయ్ లో స్థిరపడిన ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త కుమార్తె శరీర బరువుకు సమానమైన బంగారపు ఇటుకలతో తూకం వేయించి ఆ బంగారాన్ని అల్లుడికి కట్నంగా ఇచ్చాడు. ఆమె బరువు 69 కేజీలు తూగింది. అలా బంగారపు ఇటుకలతో కూతున్ని తులాబారం వేయించి అంత ఎత్తు బంగారం అల్లుడికి కట్నంగా ఇచ్చాడా తండ్రి. అలా బంగారపు ఇటుకలతో కూతుర్ని తులాభారం వేయటం చూసినవారంతా వామ్మో..ఏంటీ దర్పం మరీ ఇంతా..అనుకుంటూ షాక్ అయ్యారు పెళ్లికి వచ్చినవారంతా..
కూతురు 69 కిలోల బరువుంది. మరో 30 కిలోలు బరువున్నా అలాగే ఇచ్చేవాడేమో అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి మరోసారి షాక్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఈ బంగారమంతా నకిలీదని పెళ్లి మొత్తం ఓ థీమ్‌తో జరిగిందని ఆ ఇటుకలు అన్నీ బంగారం రంగు రాతి ఇటుకలు అని వెడ్డింగ్ ప్లానర్స్ తెలిపారు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ జోధా అక్బర్ థీమ్ తో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. అయితే వివాహ సెటప్ వివాదాస్పదమైనప్పటికీ, వెడ్డింగ్ ప్లానర్లు చాలా కష్టపడి జోధా అక్బర్ కాన్సెప్ట్‌ను రీక్రియేట్ చేశారంటున్నారు నెటిజన్లు..
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







