నిర్లక్ష్యపు డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష
- March 04, 2023
కువైట్: తన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించిన నిర్లక్ష్యపు వాహన డ్రైవర్‌కు ట్రాఫిక్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో కనిపించిన వ్యక్తి నిర్లక్ష్యంగా.. ఉద్దేశపూర్వకంగా రెండు వాహనాలను ఢీకొట్టి, అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించాడు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏవైనా చట్ట ఉల్లంఘనలు గుర్తించిన సందర్భంలో అత్యవసర నంబర్ (112)కి కాల్ చేయాలని లేదా 99324092 నంబర్‌కు “వాట్సాప్ ట్రాఫిక్” సేవ ద్వారా సమాచారం అందించి రహదారి వినియోగదారుల భద్రతకు సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటలో కోరింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







