నిర్లక్ష్యపు డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

- March 04, 2023 , by Maagulf
నిర్లక్ష్యపు డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

కువైట్: తన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించిన నిర్లక్ష్యపు వాహన డ్రైవర్‌కు ట్రాఫిక్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో కనిపించిన వ్యక్తి నిర్లక్ష్యంగా.. ఉద్దేశపూర్వకంగా రెండు వాహనాలను ఢీకొట్టి, అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించాడు.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏవైనా చట్ట ఉల్లంఘనలు గుర్తించిన సందర్భంలో అత్యవసర నంబర్ (112)కి కాల్ చేయాలని లేదా 99324092 నంబర్‌కు “వాట్సాప్ ట్రాఫిక్” సేవ ద్వారా సమాచారం అందించి రహదారి వినియోగదారుల భద్రతకు సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటలో కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com