ఒమన్‌లో భారతీయ ప్రయాణికుల కొత్త రికార్డు
- March 04, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రయాణీకుల జాబితాలో భారతీయ ప్రయాణికులు అగ్రస్థానంలో ఉన్నారు. నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2022 చివరి నాటికి 147,000 కంటే ఎక్కువ మంది భారతీయ ప్రయాణికులు మస్కట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. భారత్ తర్వాత స్థానాల్లో 53,130 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్, 39,853 మంది ప్రయాణికులతో పాకిస్తాన్ లు ఉన్నాయి.
మస్కట్, సలాలా, సోహార్ విమానాశ్రయాల ద్వారా వచ్చివెళ్లిన అంతర్జాతీయ విమానాల సంఖ్య 128 శాతం పెరిగింది. డిసెంబర్ 2022 చివరి నాటికి 65,220 విమానాల మార్కును దాటింది. 2021లో ఇదే కాలానికి ఇది 28,580 విమాన సర్వీసులుగా ఉంది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా వచ్చేవారి సంఖ్య గణనీయంగా 133 శాతం పెరిగింది. అలాగే డిపార్చర్ల సంఖ్య కూడా గత డిసెంబర్ చివరి వరకు 109 శాతం పెరిగింది.
డిసెంబర్ 2022 చివరి నాటికి మస్కట్, సలాలా, సోహర్, దుక్మ్ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించిన ప్రయాణీకుల మొత్తం సంఖ్య 9,876,762కి చేరుకుంది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణం సాగించే అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య 107 శాతం పెరిగంది. 68,737 విమాన సర్వీసులు ద్వారా 8,602,791 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.
సలాలా విమానాశ్రయం అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్యలో 71 శాతం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. విమానాశ్రయం ద్వారా 1,128,024 మంది ప్రయాణీకులు 8,672 విమానాల ద్వారా రాకపోకలు సాగించారు. సోహార్ విమానాశ్రయం నుండి వెళ్లివచ్చే అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య విషయానికొస్తే.. డిసెంబర్ 2022 చివరి వరకు 813 విమానాల ద్వారా 78,482 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022 చివరి వరకు దుక్మ్ విమానాశ్రయం 650 విమాన సర్వీసులతో 67,465 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







