హీరోగా ప్రియదర్శి: మళ్లీ హిట్ కొట్టాడుగా.!
- March 04, 2023
కమెడియన్‌గా ప్రియదర్శికి మంచి పేరుంది. అలాగే, మొన్నామధ్య ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘మల్లేశం’ అనే సినిమా వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.
తాజాగా మరో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రియదర్శి. అదే ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ఇది.
దిల్ రాజు బలంగా సపోర్ట్ ఇచ్చారీ సినిమాకి. అలాగే, ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. కేటీయార్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చారు. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్సే అందుకుంది. తెలంగాణాకి సంబంధించిన ఓ వ్యక్తి చావు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథ, కథనాలు ఆసక్తిగా అనిపించాయ్. ఫక్తు కమర్షియల్ మూవీ అనేలా కాకుండా, సమ్‌థింగ్ డిఫరెంట్ కంటెంట్‌ని తెరపై ప్రొజెక్ట్ చేశారీ సినిమాతో. అందుకేనేమో ప్రేక్షకుల్ని మెప్పించి వుండొచ్చు.
ఏదేమైతేనేం, మొత్తానికి ప్రియదర్శి హీరోగా ‘బలగం’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







