దమ్మామ్‌లో 13 మంది ప్రవాసుల అరెస్ట్
- March 05, 2023
సౌదీ: తూర్పు దమ్మామ్ నగరంలో మోసానికి పాల్పడిన 13 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా పోలీసులు తెలిపారు. వీరందరూ పాకిస్తాన్ కు చెందిన వారని, బ్యాంక్ కార్డ్‌లు సరిగా పని చేయడంలేదని.. వాటిని అప్డేట్ చేయవలసి ఉంటుందని పేర్కొంటూ తప్పుడు మెసేజ్ లను పంపడం ద్వారా అనేక మంది వ్యక్తులను ఈ ముఠా మోసగించారని పోలీసులు వెల్లడించారు. సౌదీ అరేబియా వెలుపల నివసిస్తున్న పాకిస్తానీల సహకారంతో బాధితుల ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేవారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 28 మొబైల్ ఫోన్లు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సౌదీ చట్టం ప్రకారం, మోసానికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు గరిష్టంగా SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జనవరిలో సౌదీ అరేబియా ఆర్థిక మోసం కేసులను నిర్వహించడానికి ప్రాసిక్యూషన్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









