సానియా మీర్జాకు గ్రాండ్ ఫేర్‌వెల్
- March 05, 2023
హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు గ్రాండ్ ఫేర్‌వెల్ లభించింది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడింది. డబుల్స్ మ్యాచ్ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగింది. సింగిల్స్‌లో రోహన్ బోపన్నతో సానియా తలపడింది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, అజారుద్దీన్ తదితరులు సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం సానియా మీర్జాకు ఓ ప్రైవేట్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్ రెహమాన్, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







