స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- March 05, 2023
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు ముంబయి, ఎస్‌బీఐఎల్, కోల్‌కతాలో పనిచేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..