అక్రమ వలసదారులను అడ్డుకుంటాం: బ్రిటన్ ప్రధాని రిషి సునక్
- March 06, 2023
లండన్: అక్రమ వలసదారులను అడ్డుకుంటామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హెచ్చరించారు. అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించే వలసదారులను బహిష్కరిస్తామని, వారు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించబోమని హెచ్చరించారు. అక్రమంగా ప్రవేశించడం చేయవద్దని.. అలాంటి తప్పులు చేయవద్దని వలసదారులకు సూచించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. యూరప్నుండి వలసదారుల ప్రవాహం అధికంగా ఉందని అన్నారు. ఇంగ్లీష్ చానెల్ ద్వారా పడవల్లో దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులపై ప్రత్యేక దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారుల భారం బ్రిటీష్ ప్రజలపై పడుతుందని, ఈ వలసలు న్యాయం కాదని అన్నారు. నేరపూరితమైన, అనైతిక వ్యాపారాన్ని కొనసాగించదం కూడా సరికాదని హెచ్చరించారు. పడవలను అడ్డుకుంటామని తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని అన్నారు. ఫ్రాన్స్ నుండి ప్రమాదకర ప్రయాణాల ద్వారా బ్రిటన్లోకి ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య పెరగడాన్ని పరిష్కరించడానికి కూడా బ్రిటన్ యత్నిస్తోంది.
అక్రమ వలసలపై ఈ వారం చిరవలో కఠిన చట్టాన్ని తీసుకురావాలని సునక్ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా తెలిపింది. ఈ కొత్త చట్టం చిన్న పడవలో వచ్చే వలసదారులను అడ్డుకుని, తిరిగి బ్రిటన్కు రాకుండా శాశ్వతంగా నిషేధించే బాధ్యతను హోంసెక్రటరీకి అప్పగించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







