హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
- March 06, 2023
హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి 2022 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డును సాధించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (MPPA) విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ASQ సర్వే ద్వారా ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయాల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని, అందించే సర్వీసులను పరిశీలిస్తారు.
GHIAL సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “ACI నిర్వహించే వార్షిక ASQ సర్వేలో ప్రతి ఏడాదీ ప్రయాణీకులు మమ్మల్ని ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నుకోవడం మాకు గర్వకారణం. విమానాశ్రయ విస్తరణ ద్వారా ప్రయాణికులకు అనేక సదుపాయాలు, మరింత విశాలమైన స్థలం అందుబాటులోకి వచ్చాయి. విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణ కోసం మేము మరింత ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. మా ఉద్యోగులు, మా భాగస్వాముల సహకారం లేనిదే ఈ పురస్కారం సాధ్యమయ్యేది కాదు.” అన్నారు.
ACI వరల్డ్ డైరెక్టర్ జనరల్ లూయిస్ ఫెలిప్ డి ఒలివెరా, “2022 ASQ సర్వేలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (MPPA) విభాగంలో ఉత్తమ విమానాశ్రయం అవార్డు గెల్చుకుందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రయాణికులకు మెరుగైన అనుభవం ఇవ్వడానికి మీరు చేస్తున్న కృషిని ప్రయాణికులు గుర్తించి, అభినందిస్తున్నారు.మీకు, మొత్తం మీ విమానాశ్రయ భాగస్వాములకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.” అన్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం క్రమం తప్పకుండా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) - ఎయిర్‌పోర్ట్స్ సర్వీస్ క్వాలిటీ (ASQ) ప్యాసింజర్ సర్వేలో వరుసగా 9 సంవత్సరాలు (2009 నుండి 2017 వరకు) గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాలలో ఒకటిగా నిలిచింది. 5 - 15 MPPA విభాగంలో 2009, 2010, 2016 & 2017 లో ప్రపంచ నంబర్ 1 స్థానం; 15-25 MPPA విభాగంలో 2018లో ప్రపంచ నంబర్ 4వ స్థానంలో నిలిచింది. 2019, 2020లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 ఎంపిపిఎ విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్' అవార్డులను గెలుచుకుంది. 2021లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 15-25 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’ అవార్డును పొందింది.
వైమానిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI)ను స్థాపించారు. ACI వరల్డ్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డులను ఎయిర్‌పోర్ట్ కమ్యూనిటీనే ఎంపిక చేస్తుంది. దీనిలో విమానాశ్రయ ఉద్యోగులు, ఇతర భాగస్వాములు ఉంటారు. ఉన్నతమైన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అనుభవం కోసం ఇది అన్ని విమానాశ్రయాలు నిరంతర అధ్యయనం చేసే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







