ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
- March 06, 2023
అమరావతి: ఏపీ శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిలో చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరులో కన్నుమూయగా, బచ్చుల అర్జునుడు కొన్నిరోజుల కిందటే మృతి చెందారు. ఈ నేపథ్యంలో, మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు.
.ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో నామినేషన్ల స్వీకరణ
.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు.
.అభ్యర్థి స్వయంగా గానీ, తన ప్రతిపాదకుడి ద్వారా గానీ నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం.
.వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో నామినేషన్ల దాఖలు. రిటర్నింగ్ అధికారి/ సహాయ రిటర్నింగ్ అధికారి/ శాసనమండలి ఉప కార్యదర్శికి నామినేషన్లు సమర్పించే అవకాశం.
.ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
.ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
.ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్. పోటీ ఉంటేనే ఎన్నికలు… లేకపోతే ఏకగ్రీవం అయినట్టు ప్రకటన.
.అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







