అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ టికెట్ ధర రూ. 3300
- May 04, 2016
అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలతో పొల్చితే అరశాతం మాత్రమే ఎక్కువగా ఉండనున్నట్టు తమ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వశాఖ పార్లమెంట్ కు తెలిపింది. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాతపూర్వకంగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్ కు బుధవారం తెలిపారు. 'మొదటి దశ బుల్లెట్ ట్రైన్ ల గరిష్ట వేగాన్ని గంటకు 350 కిలో మీటర్లుగా, ఆపరేటింగ్ వేగాన్ని గంటకు 320 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి 2.07 గంటల సమయం పడుతోంది. ప్రతి స్టేషన్ లో స్టాప్ ఉంటే 2.58 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ-నాగ్ పూర్, న్యూ ఢిల్లీ- చెన్నై కారిడార్ ల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుంది' అని తమ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్ కు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.దురంతో ఎక్స్ ప్రెస్ లో ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర అహ్మదాబాద్- ముంబైకి ప్రయాణించడానికి 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. హై స్పీడ్ కారిడార్ గుండా బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణిస్తే రైల్వే మంత్రిత్వ శాఖనిర్ధారించిన టారిఫ్ ప్రకారం టికెట్ ధర రూ.3300 అవుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







