లాంగ్ వీకెండ్: ఆసుపత్రుల పనివేళలు
- May 04, 2016
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) డిహెచ్ఎ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అలాగే మెడికల్ ఫిట్నెస్ సెంటర్స్ పనివేళల్ని అల్ ఇస్రా వల్ మిరాజ్ సెలవు దినం సందర్భంగా ప్రకటించింది. డిహెచ్ఎ హాస్పిటల్స్ షిఫ్ట్ టైమింగ్స్ ష్ట్రప్రకారం నడుస్తాయనీ, మెడికల్ ప్రాక్టీషనర్స్ అందుబాటులో ఉంటారని వెల్లడించింది. డిహెచ్ఎ హాస్పిటల్స్‌కి సంబంధించిన ఎమర్జన్సీ డిపార్ట్మెంట్స్ (రషీద్, దుబాయ్, లతీఫా మరియు హట్టా) రౌండ్ ది క్లాక్ పనిచేస్తాయి. దుబాయ్ హాస్పిటల్, రషీద్ హాస్పిటల్లో ఔట్ పేషెంట్ క్లినిక్స్ సెలవుల సందర్భంగా మూసివేయబడ్తాయి. లతీఫా హాస్పిటల్ ఔట్ పేషెంట్ క్లినిక్ మూతపడినా, పిడియాట్రిక్ వాక్ ఇన్ క్లినిక్ పనిచేస్తుంది. హట్టా హాస్పిటల్ ఫర్ ఫ్యామిలీ మెడిసిన్ క్లినిక్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తెరచి ఉంటుంది. స్పెషలిస్ట్ ఔట్‌పేషెంట్ క్లినిక్స్ మూతపడ్తాయి. పిహెచ్సి టైమింగ్స్ (నాద్ అల్ హమార్, అల్ మర్షా హెల్త్ సెంటర్స్) 24 గంటలూ తెరిచే ఉంటాయి. మిగతా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్‌కి సెలవు. అల్ ముహాసినా మెడికల్ ఫిట్నెస్ సెంటర్ ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకు తెరిచి ఉంటుంది. మిగతా డిహెచ్ఎ మెడికల్ ఫిట్నెస్ సెంటర్స్‌కి సెలవు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







