మస్కట్‌లో చిరుత సంచారం.. వైరల్ వీడియో నిజంకాదు!
- March 07, 2023
మస్కట్: మస్కట్ రోడ్లపై చిరుత పరుగులు పెట్టే వీడియో సోమవారం వైరల్ అయింది. ఈ వీడియోపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ముత్రా కార్నిచ్ రోడ్‌లో చిరుత పరుగెత్తుతున్నట్లు... రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ ముందు చిరుత నడుస్తున్న వీడియో క్లిప్‌లో ఉంది. పలువురు చిరుత సంచారంపై అధికారులకు కూడా సమాచారం అందించారు. అయితే, దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అసలు విషయం తెలుసుకొని నవ్వుకున్నారు. అది ఒమన్ సుల్తానేట్‌లోని ఒక కంపెనీ ఎలక్ట్రానిక్ సేవను ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రచార వీడియో అని తేల్చారు. ఈ ప్రాజెక్ట్ ను సినిమాటిక్ ఎఫెక్ట్‌లతో పూర్తి చేయడానికి దాదాపు నెలన్నర పట్టిందని, చిరుత పాత్రను చాలా సహజంగా చిత్రీకరించడంతో అందరూ ఆ వీడియో క్లిప్ ను అసలుదిగా భావించి కంగారు పడ్డారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







