డబుల్ రోల్లో కాజల్ అగర్వాల్.! దేని కోసమో తెలుసా.?
- March 07, 2023
చందమామ కాజల్ అగర్వాల్, సౌత్‌లో స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా బిల్డప్ చేసుకుంటోందీ అందాల చందమామ.
ప్రస్తుతం కాజల్ చేతిలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’ వుంది. దీంతో పాటూ, మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయ్. కాగా, కాజల్ నటించిన ఓ తమిళ చిత్రం సడెన్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది. అదే ‘ఘోస్టీ’.
తమిళంలో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ గట్రా పూర్తి చేసుకుంది. కానీ, రిలీజ్ డేటే ఇప్పుడు ఫిక్స్ చేసుకుంది. కాజల్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా ఇది. పోలీసాఫీసర్ పాత్రలో, సినీ నటి పాత్రలో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో కాజల్ కనిపించనుంది ఈ సినిమాలో. యోగిబాబు సీనియర్ నటి ఊర్వశి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మార్చి 17న ఈ సినిమా రిలీజ్ కానుంది.
హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ‘ఘోస్టీ’ సినిమాతో కాజల్‌ని త్వరలోనే తెరపై చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







