‘కేజీఎఫ్’ సినిమాపై ‘కంచర పాలెం’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!

- March 07, 2023 , by Maagulf
‘కేజీఎఫ్’ సినిమాపై ‘కంచర పాలెం’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!


కన్నడ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి ఎత్తేసిన సినిమా ‘కేజీఎఫ్’. అంతవరకూ చిన్నచూపుకు గురైన కన్నడ సినిమా, ‘కేజీఎఫ్’ దెబ్బకి ప్రపంచం దృష్టిలో పడింది. ఆ విషయం అటుంచితే, ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమా గురించి కూడా తెలిసిందే. 

ఓ చిన్న సినిమా.. పెద్ద స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ‘కేజీఎఫ్’ స్థాయిని ‘కంచర పాలెం’ వంటి సినిమాతో పోల్చడం సబబు కాదనుకోండి. అసలు విషయమేంటంటే, ‘గొప్పొడివవ్వాలిరా బాబూ.. అని తల్లి చెప్పిన మాటకు ప్రపంచంలో వున్న బంగారాన్నంతా కొల్లగొట్టేసి సముద్రంలో పడేసే కొడుకు కథే.. కేజీఎఫ్.. ’ అంటూ కంచర పాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో మంచి కంటెంట్ వున్న సినిమాలొస్తుంటే.. వాటిని తొక్కేసి.. ఈ తరహా సినిమాల్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారన్నారాయన. ఈ మాటలకు దారుణంగా ట్రోల్స్‌కి గురి కావడంతో, క్షమాపణలు చెప్పాడు వెంకేటష్ మహా. 

అయితే, తన పదజాలానికే ఈ క్షమాపణ తప్ప, తన మాటల్లోని అర్ధానికి కాదు.. అంటూ సారీ చెబుతూనే వివాదాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు వెంకటేష్ మహా. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com