సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- April 04, 2026
రియాద్: అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించిన అనంతరం గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజానీకం ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాల్లో పార్టీ అభిమానులు “జయహో అమరావతి” నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు.
సౌదీ అరేబియాలో రియాధ్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. నాయకులు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అమరావతి బహుజన ఐకాస కన్వీనర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య వీడియో కాల్ ద్వారా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో లేకపోయినా తమ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనే ఆకాంక్షతో ప్రవాసీయులు కదం తొక్కారని ఆయన ప్రశంసించారు.
అమెరికాతో పాటు గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్ దేశాల ప్రవాసీయులు అమరావతి సాధన పోరాటంలో సంఘీభావం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రావి రాధాకృష్ణా మాట్లాడుతూ, 2015లో జరిగిన అమరావతి శంకుస్థాపన సందర్భంగా మక్కా పవిత్ర క్షేత్రం నుంచి జంజం పవిత్ర జలాలను తీసుకెళ్లి చల్లిన విషయాన్ని స్మరించుకున్నారు. ఈ విజయోత్సవం ప్రవాసాంధ్రుల సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్టీఎస్ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రవాసాంధ్రులకు అందుతున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. “ప్రతి ప్రవాసాంధ్రుడి సేవ ప్రభుత్వ గుర్తింపుతో నిలిచేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
సౌదీ అరేబియా టీడీపీ అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లాహ్ అమరావతి రైతుల త్యాగాలను గుర్తు చేశారు. పార్టీ నాయకులు వడ్లమూడి సారధినాయుడు జగన్ విద్వేషపూరిత రాజకీయాలను విమర్శించారు.
మహిళా నాయకురాలు గడ్డం శిల్పా మాట్లాడుతూ, “ధరిత్రి మరియు స్త్రీ ఇద్దరూ సృష్టి, సహనం, ప్రేమ, శక్తికి ప్రతీకలు.అమరావతి నిర్మాణంలో మహిళల పాత్ర చిరస్మరణీయం” అని అన్నారు. 2014లో తమ కుటుంబం ఏడున్నర ఎకరాల భూమిని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన విషయాన్ని పార్టీ అభిమానులు బోగినేని భవానీ శంకర్, సుచరిత దంపతులు వెల్లడించారు.
ఇదే ఉత్సాహంతో ఖతర్‌లో కూడా విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం కోర్ కమిటీ సభ్యులు పొనుగుమాటి రవి, బొడ్డు రామరావు, కొడాలి సుధాకర్, మల్లేశ్వరరావు, శ్రీనివాసబాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గురువారం కూడా విజయోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ఖతర్ తెలుగు పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య తెలిపారు.
బహ్రెయిన్, కువైట్, దుబాయ్, ఒమాన్, అమెరికా నుంచి పలువురు తెలుగు దేశం నాయకులు, అభిమానులు వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి అమరావతితో తమ అనుబంధాన్ని, రైతుల ఉద్యమానికి అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తులసి కుమార్, రాజా రవికిరణ్, విశ్వేశ్వరరావు, సుధాకర్ కుదరవల్లి, ముస్తాక్, సత్యసాయి, హరిబాబు, సత్య శ్రీధర్, రమేష్, కవీంద్ర, విక్రమ్ సుఖవాసి, కోగంటి శ్రీనివాస్ రావు, ముజమీల్, రంజిత్, నరేష్, అక్షిత చెన్నుపాటి, సతీష్, జయలక్ష్మి సుగవాసి, నవీన్ గుండు, అనంత్ దాడి, అర్చన గుండు తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ ఎడారుల్లోనూ “జయహో అమరావతి” నినాదాలు మార్మోగడం ప్రవాసాంధ్రుల రాజధాని పట్ల ఉన్న ఆత్మీయతను మరోసారి చాటి చెప్పింది.



తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









