‘కేజీఎఫ్’ సినిమాపై ‘కంచర పాలెం’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- March 07, 2023
కన్నడ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి ఎత్తేసిన సినిమా ‘కేజీఎఫ్’. అంతవరకూ చిన్నచూపుకు గురైన కన్నడ సినిమా, ‘కేజీఎఫ్’ దెబ్బకి ప్రపంచం దృష్టిలో పడింది. ఆ విషయం అటుంచితే, ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమా గురించి కూడా తెలిసిందే.
ఓ చిన్న సినిమా.. పెద్ద స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ‘కేజీఎఫ్’ స్థాయిని ‘కంచర పాలెం’ వంటి సినిమాతో పోల్చడం సబబు కాదనుకోండి. అసలు విషయమేంటంటే, ‘గొప్పొడివవ్వాలిరా బాబూ.. అని తల్లి చెప్పిన మాటకు ప్రపంచంలో వున్న బంగారాన్నంతా కొల్లగొట్టేసి సముద్రంలో పడేసే కొడుకు కథే.. కేజీఎఫ్.. ’ అంటూ కంచర పాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో మంచి కంటెంట్ వున్న సినిమాలొస్తుంటే.. వాటిని తొక్కేసి.. ఈ తరహా సినిమాల్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారన్నారాయన. ఈ మాటలకు దారుణంగా ట్రోల్స్‌కి గురి కావడంతో, క్షమాపణలు చెప్పాడు వెంకేటష్ మహా.
అయితే, తన పదజాలానికే ఈ క్షమాపణ తప్ప, తన మాటల్లోని అర్ధానికి కాదు.. అంటూ సారీ చెబుతూనే వివాదాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు వెంకటేష్ మహా. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







