లుసైల్ వింటర్ వండర్ల్యాండ్: సీజన్ ముగింపు స్పెషల్ ఆఫర్లు
- March 07, 2023
దోహా: లుసైల్ వింటర్ వండర్ల్యాండ్ సీజన్ ముగిసేలోపు తగ్గించిన ధరలతో అపరిమిత రైడ్‌లను ఆస్వాదించడానికి సందర్శకులకు చివరి అవకాశాన్ని అందిస్తుంది. ఇందు కోసం సీజన్ ముగింపు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్ సందర్శకులకు అనేక ఆఫర్‌లను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ రైడ్స్ టికెట్ ఎండ్ ఆఫ్ సీజన్ స్పెషల్స్‌లో భాగంగా సందర్శకులు వారానికి ఏడు రోజుల పాటు వరుసగా 200 QAR , 150 QAR తగ్గింపు ధరలను పొందవచ్చు. దీనితో పెద్దలు, పిల్లలకు ఎటువంటి పరిమితులు లేకుండా పార్క్‌లోని అన్ని రైడ్‌లను ఆస్వాదించవచ్చు. ఎండ్ ఆఫ్ సీజన్ స్పెషల్స్‌లో భాగంగా వింటర్ వండర్‌ల్యాండ్‌కు సందర్శకులు కోకోమెలన్, ఐస్ రింక్‌పై తగ్గింపు ధరలను కూడా ఆస్వాదించవచ్చు. అలాగే సందర్శకులు ఐస్ రింక్ వద్ద మంచు మీద గ్లైడింగ్ థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు. ఇందు కోసం పెద్దలు 50 QAR, 30 QAR చెల్లించాలి. వారానికి 7 రోజులపాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్ మార్చి 18 వరకు తెరిచి ఉంటుంది. 2023న నవంబరు 1న కొత్త సీజన్ తిరిగి ప్రారంభం కానుంది. లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్ అనేది ప్రపంచ-స్థాయి వింటర్ థీమ్డ్ పార్క్. ఇది లుసైల్ నడిబొడ్డున ఉన్న అల్ మహా ద్వీపంలో ఉంది.ఇది అన్ని వయసుల సందర్శకులకు వివిధ రకాల రైడ్‌లు, ఆకర్షణలు, కార్యకలాపాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







