‘క్రౌన్ ప్రిన్స్’కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి

- March 08, 2023 , by Maagulf
‘క్రౌన్ ప్రిన్స్’కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లో కొత్తగా నియమితులైన భారత రాయబారి హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ డిప్యూటీ అమీర్,  క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు తన ఆధారాలను(క్రెడెన్షియల్స్)  సమర్పించారు. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా బయాన్ ప్యాలెస్‌లోని క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్‌ని కలిశారు.  ఈ సందర్భంగా భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరింతముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని భారత రాయబారికి ,  క్రౌన్ ప్రిన్స్ సూచించారు. "భారతదేశం - కువైట్ సాంప్రదాయ భాగస్వాములు. బలమైన చారిత్రక పునాదులపై ఇరు దేశాల మైత్రి నెలకొన్నది. అంబాసిడర్‌గా ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను కొనసాగిస్తా. " అని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com